కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీజీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగిన నివేదితా మహేష్ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. సృష్టి ఎప్పుడు, ఎలా ఆరంభమైంది? అన్న పరిశోధనలో నివేదితాతో సహా అయిదుగురు శాస్త్రవేత్తల బృందం తొలి నక్షత్రాల నుంచి వెలువడిన కాంతికిరణాలను గుర్తించారు. ఏళ్ల తరబడి విశ్వమంతా చీకటిలో ఉండటానికి గల నిగూఢమైన కారణాలను వెతకడానికి ఒక సంకేతాన్నీ కనుగొన్నాం అంటోంది నివేదితా . ఖగోళశాస్త్రవేత్తల బృందంలో భారతదేశానికి చెందిన నివేదితా ఉండటం భారతీయులకే గర్వకారణం. మొట్టమొదటి నక్షత్రకాంతిని గుర్తించిన బృందంలో ఒకరిగా నిలిచి అరుదైన గుర్తింపు పొందింది.
Categories