వెబ్ సీరిస్ తో నాకు మంచి పేరు వస్తోంది . ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వెబ్ సీరిస్ కోసం బాగా వ్యాయామం చేసేసి బరువు కూడా తగ్గాను అంటోంది ప్రణీత సుభాష్. వెబ్ సీరిస్ ఎందుకు వెండి తెర కూడా మంచి కెరీర్ కదా అని అడిగితే జయాపజయాలు బాక్సాఫీస్ డిసైడ్ చేస్తుంది .ఎంత మంచి సినిమా అయినా బోర్లా పడితే ఇంకంతే. అక్కడ జయాపజయాలు కొంత అదృష్టంపైనే ఆధారపడి ఉంటాయి. మామూలు ఉద్యోగాల్లో రాణించాలంటే కొన్ని కోచింగ్ ఉంటాయి వెండితెర ఉద్యోగాల్లో రాణించాలంటే కొన్ని కోచింగ్ లు, పరీక్ష కేంద్రాలు ఉండవు. అలా అదృష్టాన్ని నమ్ముకొని సాగాలి. వెబ్ సీరిస్ లో అవకాశాలు వచ్చాయి. నటించేందుకు ఏదైనా ఒకటే కదా అంటోంది ప్రణీత.