రోజ్ వాటర్ తో చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. పొడి చర్మానికి రోజ్ వాటర్ మంచి టోనర్ దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై గీతలు, ముడతలు తగ్గించి వృద్ధాప్య ఛాయ‌లు త్వరగా రానివ్వవు. యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు మొటిమలు, మచ్చలు తగ్గిస్తాయి. గులాబీ నీటిని సహజ మేకప్ రిమూవర్ గా వాడుకోవచ్చు. రసాయనాలు తొలగించడమే కాదు చర్మానికి కావాల్సిన తేమను ఇస్తుంది. పి. హెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గ్లిజరిన్ రోజ్ వాటర్ సమాన పరిమాణాల్లో కలిపి రాస్తే ముఖం మృదువుగా కాంతిగా మారుతుంది. వెనిగర్ కలిపి మృదువుగా మర్ధనా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోయి చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.

Leave a comment