కర్లీ హెయిర్ కావాలా?

శిరోజాలు కర్లీగా రావాలంటే సెలూన్ లో కెమికల్స్ వాడి హీటింగ్ చేస్తారు.ఇది కొద్ది కాలం పోకుండా ఉంటుంది. ఇంట్లో కూడా కర్లీ హెయిర్ సాధించవచ్చు. మంచి షాంపూ ,కండీషనర్ తో హెయిర్ వాష్ చేసుకుని బాగా తడిగా ఉన్నప్పుడే జుట్టును విభిన్న సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్ ను ఫ్రెంచ్ బ్రెయిడ్స్ అల్లాలి. జుట్టు పొడిబారిపోతే మధ్యలో తడూపుతూ గట్టిగా అల్లి బాగా ఆరిపోనివ్వాలి. తర్వాత నెమ్మదిగా ఆ జడలు విప్పుకుంటే వంకీల లుక్ కనుపిస్తుంది.లేదా జుట్టును తడిగా ఉన్నప్పుడే స్క్రూ తిప్పినట్లు అన్ని సెక్షన్లను తిప్పి అన్ని మెలికలను మాడు పై ఉన్నా వెంట్రుకలకు పిన్ చేయాలి. ఆరిపోయాక ఈ స్క్రూ తిప్పిన వెంట్రుకలను నెమ్మదిగా విడదీస్తే వంకీల జుట్టు కనిపిస్తుంది.