పాత్రల అల్లిక లోనే గ్లామర్

గ్లామర్ అనేది ప్రధానంగా కళ్ళు హావభావాల ప్రదర్శనలో ఉంటుంది. నటనలో ఉంటుంది.ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ఆవిష్కరించటం లో ఉంటుంది అంతేగాని ధరించే దుస్తుల్లో ఉంటుందని వాటి వల్లే గ్లామర్ గా ఉండటం అని నేను ఎప్పుడూ వప్పుకోను అంటోంది లావణ్య త్రిపాఠి.గ్లామర్ అంటే షార్ట్ లు, స్కర్ట్ లు వంటి మోడరన్ డ్రెస్సుల్లో కనిపించడం కాదు ఎక్స్ పోజింగ్ వేరు, గ్లామర్ వేరు ఏం చేసినా పాత్ర పరిధిలోనే చేయాలి. అసలు కొన్ని పాత్రలు సృష్టించటం లోనే ఒక గ్లామర్ మిక్స్ అయి ఉంటుంది.ఆ పాత్రల అల్లిక లోనే ఉంది గ్లామర్ అంటుంది లావణ్య త్రిపాఠి. ఇలాంటి తరహా కథలే నాకోసం వస్తే కనుక నేను మారు మాట్లాడకుండా ఒప్పుకుంటా అంటోంది లావణ్య.