ఆమె పేరే బ్రాండ్

ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా పేరే ఒక బ్రాండ్ జోధా అక్బర్, మొహంజోదారో, గౌతమ పుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక సినిమాలకు దుస్తులు నగలు డిజైన్ చేసిన నీతాలుల్లా.సినిమాలు వేడుకలు వివాహాల కోసం నగలు దుస్తులు డిజైన్ చేయటం యాడ్ ఫిల్మ్ లలో  మోడళ్ల కు స్టయిలింగ్, క్యాట్ వాక్ లలో పాల్గొనేవారికి శిక్షణ వంటి పనులతో తీరిక లేకుండా ఉంటుంది. నీతూ లుల్లా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ దుస్తులు నగలు స్టార్ హోటళ్లలో ప్రముఖ మాల్స్ అవుట్ లెట్ లు ప్రారంభించింది 320 జాతీయ-అంతర్జాతీయ చిత్రాలకు దుస్తులు నగలు డిజైన్ చేసింది.ఒక చిన్న గదిలో కుట్టు మిషన్ తో కెరీర్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా.