తోటపని చేయటంతో వయసుతో పాటు వచ్చే మతిమరుపును నియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి వాటికి నీళ్లు పోయాలి ఎరువులు వెయ్యటం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం వంటి పనులు శారీరక వ్యాయామం వంటివే.ఎండలో ఈ పనులు చేయడం వల్ల శరీరానికి తగినంత విటమిన్-డి అందుతోంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయి అంతేకాదు కొన్ని మొక్కలు ఎయిర్  ప్యూరిఫైయర్లు లాగా పనిచేస్తాయి ఇంట్లో, కార్యాలయాల్లో ఇవి పెంచితే గాలిలోని కలుషితాలు పోతాయి.అలోవెరా పీస్ లిల్లీ స్పైడర్ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ   బోస్టన్ ఫెర్న్ అరికా పామ్ క్రిశాంతమెమ్ చైనీస్ ఎవ్వర్ గ్రీన్ గోల్డెన్ పోథోస్ లేదా మనీ ప్లాంట్ మొదలైనవి గాలిని ఫిల్టర్ చేస్తాయి. ఈ మొక్కలు వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు మనపై ఉండవు.

Leave a comment