ఎలాగో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అలవాటైపోయింది కనుక పిల్లలను తీరిక చిక్కినప్పుడల్లా కామిక్ కథలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమర్ చిత్ర కథ, ట్వింకిల్ వంటివి  ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి వీటిని కొంత కాలం ఉచితంగా చదువుకోవచ్చు.లిట్ ప్రా  వెబ్ సైట్ లో పిల్లలు పుస్తకం చదవడం అదీ వేగంగా తప్పులు దొర్లకుండా ప్రాక్టీస్ చేయవచ్చు ఎలా చదువుతున్నారో తెలుసుకునేలా ఆడియో రికార్డ్ సౌకర్యం ఉంది పెద్దవాళ్ళు schilitpro.com లోకి లాగిన్ అయి పిల్లలచేత రకరకాల పుస్తకాలు చదివించవచ్చు ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఎన్నో హాస్య కథలు బొమ్మలతో కూడిన పుస్తకాలు ఉన్నాయి.ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డిజిటల్ లైబ్రరీ పిల్లలకు అర్ధం అయ్యే భాషలో చాలా విషయాలు తెలియజేస్తోంది.పిల్లల్లో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం పెరిగేందుకు ఇలాంటి వన్నీ పెద్దవాళ్ళు వెతికి పట్టుకుని పిల్లలకు పరిచయం చేయాలి.

Leave a comment