కాలీ చూడేల్ అనేవాళ్ళు

ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచే నన్ను అందరూ కాలీ చూడేల్ ( నల్ల దయ్యం) అని వెక్కిరించేవారు ఇలాటి వెక్కిరింతలు నాకే కాదు అకారణంగా బాల్యం నుంచి ఆత్మన్యూన్యుత కలిగేలా ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రతి అమ్మాయి అబ్బాయి విషయంలో వచ్చే సమస్య ఇది.నువ్విలా నల్లగా పొట్టి గా ఉన్నావు అందంగా లేవు అనేస్తారు అంటోంది సుహానా ఖాన్.ప్రఖ్యాత నటుడు షారుక్ ఖాన్ కూతురు ఆమె వంటి రంగును ఎగతాళి చేస్తూ వచ్చిన కామెంట్ల స్క్రీన్ షాట్స్ తీసి ఇంస్టాగ్రామ్ లో పెట్టింది సుహానా ఖాన్. నా ఎత్తు 5.3 చామనఛాయ తో ఉంటా అయినా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నేను నా చర్మాన్ని తెల్లబరుచుకొను.అలా ఏవీ చేయను కూడా అని పోస్ట్ చేసింది సుహానా.