ఏ వేడుక కైనా కళ తెచ్చేవి పట్టుచీరెలే. ఆ అందమైన పట్టు చీరెలకు కలంకారీ కళ ను జత కలిపి పెన్ కలంకారీ పట్టు చీరెలను తీసుకొచ్చారు డిజైనర్లు. కలంకారీ ఆర్ట్ తో రకరకాల వస్త్రాలు తయారు చేస్తున్నారు శ్రీ కాళహస్తి కళాకారుల చేతిలో చందేరి, ఉప్పాడ, ధర్మవరం, ఇక్కత్, గద్వాల్, కాంచీపురం చీరెలు ఇంపైన రంగులతో ముచ్చటైన డిజైన్ లతో మెరిసిపోతున్నాయి. పట్టుచీరెలే కాదు సాదాసీదా కాటన్స్ కూడా ఈ కలంకారీ కళలో కొత్త అందం సంతరించుకుంటున్నాయి. పూలు, తీగలు అందమైన అమ్మాయిలు, రాజు గారి ఊరేగింపులు పట్టు చీరెల పైన కొలువుదీరు తున్నాయి. పట్టు చీరెల మెరుపుతో కలంకారీ అందాల నయా లుక్ తీసుకు వచ్చాయి.

Leave a comment