“మూషిక వాహన మోదక హస్తే

చామర కర్ణ విళంబిత చతురే

వామన రూప హర పుత్ర

విఘ్న వినాశక పాద నమస్తే!!”

దసరా పండుగ చాలా వైభవంగా జరిగింది.శ్రీ లలితా సహస్ర నామ పారాయణం,కుంకుమార్చన,బాల,కుమారి,సుహాసిని పూజలు, బొమ్మల కొలువు తో సందడిగా వుంది.
ఈ రోజు మరి అత్తాపూర్ లో వున్న “విజయ గణపతి”ని చూసి వద్దాం రండి.
ఇక్కడ స్వామి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు.ప్రతి రోజూ ఉదయం,సాయంత్రం  భక్తితో పూజలు నిర్వహిస్తారు. పండుగ పర్వదినాలలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి సేవ చేసే భాగ్యం కలుగుతుంది.
వినాయక చవితి, దసరా శరన్నవరాత్రులు చూడడానికి రెండు కళ్ళూ చాలవు కూడా.మనం అన్ని కార్యక్రమాలకు ముందుగా విఘ్నేశ్వరుడుని పూజించి అనుగ్రహించ మని మొకరిల్లిన తప్పకుండా ఆశీస్సులు అందిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం,కుడుములు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment