బ్లాక్ సాల్ట్ ని చల్లని ఉప్పు అని కూడా పిలుచుకొవచ్చు అంటారు వైద్యులు. ఈ వేసవిలో బ్లాక్ సాల్ట్ పదార్థాలలో ఉపయోగించటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పైకి నల్లగా ఉండి పొడి చేయగానే లేత గులాబీ రంగులోకి మారిపోతుంది.ఐరన్ తో పాటు ఇతర ఖనిజా లవణాలు పోషకాలు ఉన్నాయి. సలాడ్స్ లో కలిపితే మంచి రుచి వస్తుంది. వేసవిలో వచ్చే చమట పొక్కుల నుంచి శరీరాన్ని రక్షించుకోవాలంటే గొరు వెచ్చని నీళ్ళలో చిటికెడు నల్ల ఉప్పు వేసి స్నానం చేయాలి. నల్ల ఉప్పు కలిపిన నీటిలో తల స్నానం చేస్తే జట్టు ఊడకుండా ఉంటుంది. మొటిమలు రాకుండా స్క్రబ్బర్లు ,క్లెన్సర్లలో కాస్త నల్ల ఉప్పు కలిపితే మంచి ఫలితాలు పొందవచ్చు.

Leave a comment