మాను కాదు కుండి

అన్ని కొత్త కొత్తగా ఉండాలి,కళ్ళను ఆకర్షించాలి ఇంటికి అందం తీసుకురావాలి. అందుకే అతి సాధరణమైన వాటికోసం కూడా అసాధారణంగా అనిపించే వస్తువులు ప్రత్యక్ష్యం అవుతాయి.మొక్కలను పెంచుతాం,అవి కుండిలో పెరుగుతూ ఉంటాయి. అవి కాస్తా మానుల పెరిగితే చూసేందుకు వింత. అచ్చం చెట్టు మానుల కనిపించే పగోడ జాక్ ప్లాంటర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిని పాలీరెజిన్ తో తయారు చేస్తారు. బయట వైపు బెరడు ఉన్న చెట్టు దుంగలా కనిపిస్తాయి. లోపల మట్టిపోసి మొక్కలు పెంచవచ్చు లేదా హాల్లో మూలకు పెట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో నింపేసినా బానే ఉంటుంది.