వివాహం అయినా వెంటనే పిల్లలు పుట్టకుండా ,లేదా బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండాలని గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు.అయితే ఈ మాత్రల్లో ఇంకొక అద్భుతమైన గుణాల్ని కనిపెట్టారు పరిశోధకులు. ఇవి అండాశయ క్యాన్సర్ ను నిరోధించగలుగుతున్నాయట. ఈ మాత్రల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ రెండు రకాల హార్మోన్స్ ఉండేలా తయారు చేస్తారు. ఈ మాత్రలని ప్రపంచంలో ప్రతి రోజు పదికోట్ల మంది మహిళలు వాడిన మహిళలపై చేసిన పరిశోధనలో అండశయ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ శాతం అతి తక్కువ అని తేలింది. ఈ అధ్యయనంలో మాత్రల శక్తినీ పరిగణలోకి తీసుకొన్నారు .ఈ మాత్రల వల్లనే మహిళలకు ఈ మేలు జరిగిందని కనిపెట్టారు.

Leave a comment