పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని అదేపనిగా తోముతూ ఉండటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అవేమీ వంటింట్లో గిన్నెలు కాదు తోమేస్తే మెరిసి పోయేందుకు .దంతాలపైన రక్షిత పొరలుంటాయి. ఆ పొరలు తొలిగిపోతే పళ్ళు పోటుపెడతాయి. అందుకే దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తని బ్రష్ తో నెమ్మదిగా తోముకోవాలి,లేకుంటే చిగుళ్లు దెబ్బ తింగాయి.దంతంపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కోక్ వంటి ఆమ్లాలు కలిగిన డ్రింక్ తాగిన వెంటనే బ్రష్ చేసినా ప్రమాదం. నీటితో పుకిలించి ఆమ్లా ప్రభావం పోయాక అప్పుడు బ్రష్ చేయాలి. బ్రష్ గుండ్రంగా పైకి కిందకీ కదిలిస్తూ వాడాలి.దంతాల సమస్య రాకుండా జాగ్రత్తపడాలి.

Leave a comment