పాపాయికి మసాజ్

మియామీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీలోని టబ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు పసి పాపకు స్నానం చేయించేప్పుడు అమ్మ స్పర్శతో చేసే మసాజ్ వల్ల నాడి వ్యవస్థ ఉద్దీపం అవుతుందంటున్నారు .సంతోషం ఇచ్చే రసాయనం సెరటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ కార్డిజాల్ ఉత్పత్తిని మసాజ్ తగ్గిస్తుంది. మసాజ్ తో బిడ్డకు శారీరక మానసిక ఒత్తిడి తగ్గుతుంది.పాపయికి 21 రోజులు నిండాక ప్రత్యేకంగా నూనె ,మీగడ రాసి మాసాజ్ చేసి నలుగుపెట్టి స్నానం చేయిస్తే, అమ్మ చేతులు కదలిక పాపాయికి తృప్తి ఇస్తుంది. మసాజ్ తో పిల్లల చర్మం నిగారిస్తుంది. రక్త ప్రసరణ చక్కగా సాగుతుంది.