పొట్ట ఫిట్ గా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి . పైగా ఈ చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చు కోవాలి . ఉదయాన్నే ఖాళీ పొట్టతో యాసిడ్ ను ఉత్పత్తి చేసే పదార్దాలు ఏమీ తినకండి . ప్రతిరోజు కప్పు నీటిలో రెండు స్పూన్ల ఉసిరి రసం కలిపి తాగితే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది . ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు తాజా సీజనల్ పండ్లు ,డ్రై ఫ్రూట్స్ మొలకెత్తిన గింజలు ఉండాలి . ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగాలి . ఆహారం తీరికగా నమిలి తినాలి . కూల్ డ్రింక్స్ ,పాస్ట్ ఫుడ్ శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి . నిర్ణిత సమయానికి భోజనం చేయాలి . పుదీనా వేసి మరిగించిన టీ తాగటం ఎంతో మంచిది .

Leave a comment