మట్టి పరిమళం మనకు కొత్త కాదు.పూర్వం మట్టి కొండలే వంట పాత్రలు.ఆ తరువాతే ఇనుము అల్యూమినియం  స్టీలు వచ్చాయి.మట్టికుండలో వండిన ఆహారం ఐరన్,ఫాస్పరస్, క్యాల్షియం,మెగ్నీషియం ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి.మూత గట్టిగా పెట్టి వండితే పోషకాలు ఆవిరి కావు. ఉష్ణోగ్రత ఆవిరి అన్ని వైపులా పరచుకుని వంటకం సంపూర్ణంగా ఉడుకుతుంది.కట్టెల పొయ్యి పైన మట్టికుండలో వండిన ఏ పదార్థమైనా రుచిగా పోషక భరితంగా ఉంటుంది. మట్టికి ఉండే క్షార గుణంతో ఆహారంలోని ఆమ్లా గుణాలు నశిస్తాయి. ఆహారం త్వరగా చల్లారదు వండినా చాలా సేపటి వరకూ తాజాదనం కోల్పోదు మట్టి పాత్రలో ఆహారం శ్రేష్టం అంటున్నారు ఎక్సపర్ట్స్.

Leave a comment