సీజన్ లో తప్పవు

వర్షాలు పడే రోజుల్లో వైరల్ ఇన్ ఫెక్షన్లు సర్వ సాధారణం. దగ్గు,జలుబు ,జ్వరం ,జాయింట్స్ పెయిన్స్ ఇవీ ఎక్కువగా వస్తాయి. బస్ లు ఇతర వాహానాల్లో జనంతో కలిసి ప్రయాణం ,ఎయిర్ కండీషన్ ఆపీసులో పని చేయటం ,ఇన్ ఫెక్షన్లకు త్వరగా పాకిపోయేందుకు దారీ తీస్తాయి. ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవటం వల్ల వైరస్ వ్యాపించకుండా చూసుకోవచ్చు. బాటిల్ వాటర్ ,కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రోలైట్ సోల్యూషన్ వాడు కోవాలి. ఇన్ ఫెక్షన్ సోకితే సాధ్యమైనంత విశ్రాంతి అవసరం . తులసి అల్లం రోజుమేరా ,పూదినా ,పసుపు వంటి వెర్ట్స్ బాగా పని చేస్తాయి. వీటిని ఎన్నో విధాలుగా శరీరానికి అందేలా వాడుకోవాలి. ఇంట్లో కూడా దుమ్ము వచ్చే ప్రాంతాలను శుభ్రంగా దులిపి కర్టెన్స్ ,దిళ్ళు దుప్పట్లు ఎప్పటికప్పుడు మార్చి వేస్తూ ఉండాలి.