కంచంలో అన్నం తెల్లగా వల్లెపూవులా ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. కానీ దంపుడు బియ్యం అన్నం పోషకాలకు నిలయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వరిపొట్టు కింద ఉండే తవుడు పోరలో విటమిన్ ,ఖనిజాలు చాలా ఉంటాయి. పాలిష్ పడితే ఇవన్నీ పోతాయి. సోడియం పాళ్ళు కూడా దంపుడు బియ్యంలో తక్కువే నియాసిన్ ,విటమిన్ బి3 ఎక్కువ. వీటిలోని మెగ్నిషియం ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచె సెలీనియం కూడా దంపుడు బియ్యంలో ఎక్కువగానే ఉంటుంది. కాస్త ముదురు రంగులు ,దుమ్ముతో వున్నట్లు కనిపిస్తాయి కానీ దంపుడు బియ్యం ఆరోగ్యం అంటున్నారు పరిశోధకులు.

Leave a comment