స్వచ్చమైన నీళ్ళు కావాలా?

చిల్లగింజల చెట్టును క్లియరింగ్ నట్ ట్రీ అని ఇంపుడు చెట్టు అని పిలుస్తారు. మన దేశంతో పాటు శ్రీలంక ,మయాన్మార్ ,జింబాబే బోట్యాన్ అడవుల్లో పెరుగుతాయి. బాగా పండిన పండ్లు ఎర్రని రంగులో ఉంటాయి. గింజలు గుండ్రంగా ,ముదురు గోధుమ రంగులో పట్టులాంటి నుగుతో ఉంటాయి. పొడిచేస్తే పసుపు రంగులో ఉంటుంది. ఈ చిల్లగింజ గంధం నీళ్ళలో వేస్తే తేరుకోని మడ్డి అడుగుకు చేరి పైకి స్వచ్చమైన నీళ్లు తేరుకుంటాయి. వాటర్ పిల్టర్స్ తో వాడే కాట్రిడ్జ్ కూడా చిల్లగింజ గంధంతో తయారైందనే పరిశోధకులు చెపుతున్నారు. ఈ చిల్లగింజ గంధంతో కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యం కూడా .మధుమేహాం నియంత్రణలో ఉంటుంది. ఎక్కడో పైపుల్లోంచి వచ్చే నీళ్ళు తాగుతాం కనుక ఈ గంధం కాస్త కలిపితే స్వచ్చమైన నీళ్ళు తాగవచ్చు.