ఎన్ని పాత్రల్లో నటించినా ఇంకా కొత్తగా ఎదో మిగిలి పోయింది అనిపిస్తుంది. నేను ఎదురుచూస్తాను వాటికోసం . దర్శకులు ,రచయితలు ఇంకెన్నో పాత్రలు సృష్టించాలి కూడా . అయిపోయింది ఇంకేం లేవు అనుకొంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడదు . కొత్త కథలు వస్తూనే ఉంటాయి . సరైన సమయంలో వాటిని నేను అందిపుచ్చుకొంటూనే ఉన్నాను అంటోంది కాజల్ . ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది . ప్రపంచంలోనే స్ఫూర్తి వంతులైన మహిళలు చాలామంది కనిపిస్తారు . ఒక్కోళ్ళ వెనుక ఒక్కొ కథ ఉంది . ఎన్నో కథలు నన్ను సవాల్ చేసే పాత్రను నేనెంత చక్కగా మలచగలను అన్నాది మాత్రమే ఆలోచిస్తా . ది బెస్ట్ చేయాలనిపిస్తుంది నాకు అన్నాది కాజల్ .

Leave a comment