లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఫేషియల్స్ కోసం పార్లర్ కు పోయే అవసరం ఏమి లేదు. ఇంట్లోనే కొన్ని రకాల ఫేషియల్స్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు,ఓట్ మీల్,తేనె ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా చేస్తోంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలిపి మొహం పైన మాస్క్ లాగా వేసి ఓ పదిహేను నిముషాలు ఆలా వదిలేసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మం చాలా మృదువుగా అయిపోతుంది. పసుపు,పెరుగు,జాజికాయ తేనె కలిపిన మిశ్రమం కూడా బాగా పని చేస్తుంది. అలాగే కలబంద గుజ్జు టెట్రీ ఆయిల్ చుక్కలు రెండు చుక్కలు వేసి మొహానికి మాస్క్ వేస్తే ఇది సహజసిద్దమైన యాంటీ బాక్టీరియల్ గా పనిచేసి మొటిమలను తగ్గించి మొహాన్ని మెరిపిస్తుంది. కలబందగుజ్జు గ్రీన్ టీ పొడి కలిపినా మిశ్రమం కూడా చక్కని సహజమైన ఫేస్ పాక్ .

Leave a comment