ఇప్పుడు మనకి మంచి బీర తీగె వేద్దామంటే చెట్టుకి ఎండి ఒరుగైపోయిన బీరకాయ నుండి మన చేతుల్లోకి రాలే గింజలు దొరకవు. గుప్పెడు ఆకు కూర విత్తనాలు దొరకవు. విత్తనాలు పండించడం లేదన్న మాట. అవి మార్కెట్ లో దొరికే అమ్మకపు వస్తువులు. స్వయంగా ఈ సంపదనని మనం దాచుకోవాలి రాబోయే తరాల కోసం. ఇప్పుడో చిన్న విశేషం వినాలి. అమెరికాలో ఉన్న అవకాడో పళ్లన్నీ ఒక చెట్టు నుంచి వచ్చిన విత్తనాలని తేలింది. ఈ కథ గురించి 92 ఏళ్ళు వెనక్కి వెళితే అమెరికాకు చెందినా రుడాల్ఫ్ అవకాడో పళ్ళ గురించి ఏదో మ్యాగజైన్ లో చదివి ఆ చెట్లు పెంచాలనుకొన్నాడు. ఆ విత్తనం ఎలాగో సంపాదించి ఒకే ఒక చెట్టు నాటాడు. అవకాడో పెంచే పద్ధతి తెలుసుకొని మరీ ఆ మొక్కను కంటికి రెప్పలా కాపాడాడు. ఆ చెట్టుకు అవకాడో కాయలు కాశాయి. ఆ చెట్టు కాయల విత్తనాలు సేకరించి అమ్మాడు. నర్సరీ పెట్టి ఆ విత్తనాలు అమ్మాడు. ఇప్పుడు అమెరికా మొత్తం ఉన్న అవకాడో చెట్ల విత్తనాలన్నీ రుడాల్ఫ్ నాటిన మొక్కవే. ఒక ఫలసాయం వెనకాల ఎంతో కథ వుంటుంది.
Categories