నీహారికా, ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని ఇంట్లో శ్రద్దగా వాడుకుంటున్నాము. ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి అవసరం లేనివన్నీ కొంటున్నామా? అప్పుడు ఆహారం, డబ్బు రెండూ వృధానే కదా ఇంకా నీహారికా, మనం అల్పాహారమైనా, భోజనమైనా ఎంత కావాలో అంతే ప్లేట్ లో పెట్టుకోవాలి. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కావలసినంతే ఆర్డర్ ఇవ్వాలి. ఒక వేళ మిగిలితే మోహమాట పడకుండా పార్సిల్ చేసి ఇవ్వమని అడగాలి కూడా ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మనమే తినొచ్చు తప్పేముంది. అనవసరమైన భేషజాలు దండగ. అలాగే ఇప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళలో వృధా అయ్యే ఆహారం లెక్కేలేదు. మెనూ జాబితా చుస్తేనే అస్సలు ఇందులో సగం పదార్ధాలైనా టేస్ట్ చేయగలమా అనుకుంటాము. ఇలాంటివాన్ని కాస్త చుసుకోగాలమేమో. 2013లో వచ్చిన ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 78 ఆకలి దేశాల జాబితా లో భారత్ రాంక్ 63 గా వుంది. ఇప్పటి నివేదిక అందరికీ తిండి చేరడమే లేదంటోంది. మనకి ఎందుకు బాధ్యత లేకుండా పోయింది?
Categories
Nemalika

44 వేల కోట్ల రూపాయిల ఆహారం వృధా

నీహారికా,

ఒక్క కొత్త నివేదిక వచ్చింది చూడు. భారత్ లో ఏటా 67 మిలియన్ టన్నుల ఆహారం వృధా అవుతుందని అంచనా. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆహారంలో అసలు మొత్తం వార్షిక ఉత్పత్తులు 40 శాతం అంటే 8.3 బిలియన్ డాలర్ల మేర ఆహారం వృధా అవ్వుతుంది. ఇప్పుడు ఆ ఆహారం వృధా చేస్తున్న వారి లిస్టులో మనము ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే కూరలు, పండ్లు, పచారీ సరుకులు కావలసినంత వరకే కొని ఇంట్లో శ్రద్దగా వాడుకుంటున్నాము. ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి అవసరం లేనివన్నీ కొంటున్నామా? అప్పుడు ఆహారం, డబ్బు రెండూ వృధానే కదా ఇంకా నీహారికా, మనం అల్పాహారమైనా, భోజనమైనా ఎంత కావాలో అంతే ప్లేట్ లో పెట్టుకోవాలి. హోటళ్ళు రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కావలసినంతే ఆర్డర్ ఇవ్వాలి. ఒక వేళ మిగిలితే మోహమాట పడకుండా పార్సిల్ చేసి ఇవ్వమని అడగాలి కూడా ఎవరికైనా ఇవ్వొచ్చు. లేదా మనమే తినొచ్చు తప్పేముంది. అనవసరమైన భేషజాలు దండగ. అలాగే ఇప్పుడు పార్టీలు, పెళ్ళిళ్ళలో వృధా అయ్యే ఆహారం లెక్కేలేదు. మెనూ జాబితా చుస్తేనే అస్సలు ఇందులో సగం పదార్ధాలైనా టేస్ట్ చేయగలమా అనుకుంటాము. ఇలాంటివాన్ని కాస్త చుసుకోగాలమేమో. 2013లో వచ్చిన ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 78 ఆకలి దేశాల జాబితా లో భారత్ రాంక్ 63 గా వుంది. ఇప్పటి నివేదిక అందరికీ తిండి చేరడమే లేదంటోంది. మనకి ఎందుకు బాధ్యత లేకుండా పోయింది?

Leave a comment