Categories
సాంప్రదాయ నగరాల్లో జూకాలు చాలా బావుంటాయి. సెలబ్రేషన్ లుక్ రవాలి అంటే అమ్మాయిలు జూకీలు పెట్టుకోవాల్సిందే. అదే అదే బంగారు జూకీలు కాకుండా బ్లాక్ మెటల్ జూకీలు పెట్టుకుంటే ప్రత్యేకమైన ఎధ్నిక్ లుక్ వస్తుంది. ఇప్పటి వాతావరణంలో చేనేత చీరలపై, లేదా నేత, కాటన్ డ్రెస్సుల పైకి ఈ ఎధ్నిక్ డిజైన్ మెటల్ జూకీలు ఎంటో చక్కగా మాచ్ అవ్వుతాయి. ఇది సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కూడా, టెంపుల్ జ్యూవెలరీగా ముద్దుగా పిలిచే ఈ జూకీలు రంగు మరే సరికి ఫ్యాషన్ జూకాలైతే అందరిలో డిఫరెంట్ గా కనిపించడం ఖాయం. ఒక సారి వెరైటీస్ చుస్తే అర్ధమైపోతుంది. ఈ జూకీలు ఎంత అందంగా ఎంత విభిన్నంగా వున్నాయో. అందమైన డిజైనర్ చీర కట్టుకుని ఈ జూకీలు మేచింగ్ గా పెట్టుకుంటే మరే నగలు ధరించక పాయినా బావుండి తీరుతాది.