Categories
ఉత్తర ప్రదేశ్ లో కన్నౌజ్ పట్టణాన్ని భారత దేశపు అత్తరు రాజధాని అంటారు. ఇక్కడ వీధివీధికి ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఆర్గానిక్ అత్తరు. గులాబీ,చామంతి,జాజి,బంతి పూలను రాగి పాత్రలో వేసి నీళ్ళు కలిపి మరిగిస్తు ఆవిరికి ఇంకో పాత్రలో గొట్టం ద్వారా పంపుతారు. ఆ ఆవిరి చుక్కలు నూనెగా అత్తరుగా మారతాయి. ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజులు పడుతుంది. గులాబీలతో తయారయ్యె రూహ్ ఆల్ గులాబీ అనే అత్తరు ఎనిమిది వేల కిలోల గులాబీ లను వాడితే ఒక కిలో అత్తరు వస్తుంది. దీని విలువ 13 లక్షల కంటే ఎక్కువే. అలాగే అగర్ వుడ్ తో చేసే అత్తరు కిలో యాభై లక్షలు చేస్తుంది. వివరాల కోసం www.kannanjattar.com లో చూడచ్చు.