ఈ ఎండల్లో ఇక తేలికైన కాటన్ చీరెలు ఎంపిక చేసుకోవాలి పశ్చిమ బెంగాల్ లోని పులియా లో తయారయ్యే కాటన్ చీరెలు తేలిక రంగుల్లో ఎంతో సౌకర్యంగా ఉంటాయి. అలాగే బనారస్ కాటన్స్ కూడా సింగిల్ వీవ్ తో తయారయ్యేవే రాజస్థాన్,గుజరాత్ లకు చెందిన టై అండ్ డై లేదా బందీని చీరెలు కూడా మంచి ఎంపిక మంగళగిరి కోటా కోయంబత్తూర్ వంటి కాటన్ లు వేసవి లో ధరించేందుకు ప్రత్యేకంగా తయారవుతాయి. మధ్యప్రదేశ్ కు చెందిన మహేశ్వరి కాటన్ చీరెలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి ఒంటికి చల్లదనాన్ని ఇచ్చే ఈ కాటన్స్ ధరలు కూడా తక్కువే.

Leave a comment