అపార్ట్ మెంట్స్ లో వాల్ ప్లాంటర్స్ ను పెంచుకుంటే గాలి నుంచి కాలుష్య కారకాలను ఫిల్టర్ చేయటం ద్వారా ఇంటి గోడలు విడుదల చేసే వేడి కూడా తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. ఇంటి అలంకరణలో ఇవి ప్రధాన ఆకర్షణ కూడా. ఇంటి లివింగ్ రూమ్ గోడలకు నాలుగు ఇండోర్ ప్లాంట్స్ బాక్స్ లను ఒక దాని పైన ఒకటి సరైన స్పేస్ తో అమర్చితే చక్కగా ఉంటుంది. గదుల గోడలకు సాధారణంగా లేత రంగులే వాడతారు కనుక ఆ రంగు మ్యాచ్ అయ్యే ప్లాంటర్స్ ను ఎంచుకోవాలి. ఇంటి వాల్స్ మొత్తం గ్రీన్ థీమ్ తో ఉండాలి అంటే నర్సరీ లో కుండీల్లో పెంచినవి తెచ్చి నేరుగా వాటిని ప్లాంటర్స్ లోకి మార్చుకోవచ్చు. డైనింగ్ ఏరియా లో వెలుతురు ఎక్కువ కావాలంటే మొక్కలతో పాటు లైటింగ్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మెట్లు కూడా అలా వదిలేయకుండా ఎకో ఫ్రెండ్లీ టీ థీమ్ తో వాల్ ప్లెయిన్ గా ఉండకుండా నింపవచ్చు.
Categories