Categories
ప్రమాదంలో కాలు పోగొట్టుకుని కృత్రిమ పాదం తో నృత్యం చేసి కోట్లాది అభిమానులకు దగ్గరైన నా జీవితం నాకే కాదు ఎంతో మందికి పెద్ద గుణపాఠం ఎంతో మందికి ప్రేరణ మోటివేషనల్ స్పీకర్ అయింది. ఈ కష్టతరమైన ప్రయాణం నేను ఎంత కష్టపడి పూర్తి చేశానో చెప్పేందుకే అంటుంది ధీశాలి సుధా చంద్రన్. 38 సంవత్సరాల క్రితం ఆమె మయూరి గా నటించిన సినిమా ఎంతోమందికి స్ఫూర్తి. సినీ నటిగా, టీవీ సీరియల్స్ లోనూ ఆమె కెరీర్ నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం విలన్ పాత్రల్లో నటించేందుకు ఎంతో స్కోప్ ఉంటుంది. నిజ జీవితంలో నేను చాలా సాఫ్ట్ అందుకే ఆ పాత్రలు నాకు ఎంతో ఆసక్తిగా అనిపిస్తాయి అంటుంది సుధా చంద్రన్.