తెలుసుకొన్నంత మాత్రాన ఆచరించాలని లేదు. కొన్ని విషయాలు వినేందుకు బావుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్నింటిలో నమ్మకాలు  ముందుంటాయి . నగల చుటూ కూడా బోలెడన్ని నమ్మకాలున్నాయి. మార్కెట్ లోని కొత్త డిజైన్ నగ  వచ్చిందంటే కొనేవాళ్లున్నారు. కొన్ని నగలు అందులో వేసే రాళ్లు రత్నాలు గ్రహాల కిష్టమంటున్నారు. నిపుణులు. ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆరోజు కెంపులతో చేసిన నగలు ధరిస్తే మంచిదట. అలాగే సోమవారం చంద్రుడికి ఇష్టం ఆరోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవాలి. మంగళవారం కుజుడికి ఇష్టం ఆరోజు పగడాల ఆభరణాలు ధరించాలి. బుధవారం బుధగ్రహం అభీష్టం ప్రకారం పచ్చలు వేసుకుంటే మంచిది , గురువారం బృహస్పతికి ఇష్టం అంచేంత పుష్యరాగం తో చేసిననగలు వేసుకోవాలి. శుక్రవారం శుక్రుడికి ప్రీతీ పాత్రమైన దినం కాబట్టి వజ్రాల నగలేవేసుకోవాలి. ఇక శనివారం నీలం రాళ్ల నగలు ధరించాలట. అవి శనిదేవుడికి ఇష్టమైన రంగు పైగా ఈ రోజు నవరత్నాల తో కూడిన నగ  ధరించాలి. వీటికి సైంటిఫిక్ రీజనింగ్ అడక్కండి. నమ్మకాల గురించి చెప్పుకున్నాం అంతే. మరి మీకు నమ్మకం వుందా ?

Leave a comment