బియ్యం కడిగిన నీళ్లు పారబోస్తాం కదా . అలాగే గంజి వార్చేస్తారు కదా కానీ ఈ రెండు నీళ్లలోనూ అనేక పోషకాలున్నాయని ముఖ్యంగా అవి సౌందర్య పోషణకు ఎంతో ఉపయోగపడతాయని ఎక్ప్ర్ట్స్ చెపుతున్నారు. చైనా జపాన్ దక్షిణాసియా లోని కొన్ని ప్రాంతాల్లో సౌందర్య పోషణ కోసం బియ్యం బియ్యం కడిగిన నీళ్లు వాడతారట. బియ్యం నీళ్లు మంచి ఫేస్ మాస్క్ అంటున్నారు. బియ్యం నీళ్లు చర్మ రక్షణలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తల స్నానం చేసే ముందు బియ్యం నీళ్లను తడుపుకుని మస్సాజ్ చేసి ఏదైనా హెర్బల్ షాంపూతో తలంటుకుంటే జుట్టు మెరిసిపోతుందిట. జుట్టు చివర్లు చిట్లుతువుంటే ఆ చివర్లను బియ్యం నీళ్లతో తడుపుతూ తలస్నానం చేస్తే ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయి. ఇవి మంచి కండీషనర్. ఈ బియ్యం నీళ్లు ఒక బాటిల్ లో పోసి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ ఆ చల్లని నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం నిగారింపును రావటమే కాకుండా చర్మం పైన మడతలు మచ్చలు మొటిమలు పోతాయి. ఇవి మూడు రోజుల కంటే ఎక్కువ నిలువ ఉంటే పోషకాలు పోతాయి.
Categories