GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి  ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి  అని ప్రచారం చేసుకున్నాడు. హనుమాన్ చాలీసా లో కూడా దెయ్యాలున్నాయి హనుమంతుడు కాపాడతాడనే కదా వుంది అని బుకాయిస్తాడు. అతని మాటలు నమ్మిన గ్రామస్థులు చేతనైనంత సొమ్ము అతని చేతిలో పెట్టి దెయ్యాలను కొనుక్కున్నారు. ఇది పోలీసుల కంటపడి యాదవ్ ను అతని అనుచరులు ఇద్దరినీ జైల్లో పెట్టారు. దెయ్యాలను కొనుక్కోవటమేమితి అనుకోనక్కర్లేదు. చేత బడులు, మంత్రాలు, మాయలు ఉన్నాయని ఇప్పటికీ తెలంగాణ మారుమూల గ్రామాల్లో ఎంతెంత అన్యాయాలు జరుగుతున్నాయి. ఎంత మంది అమాయకులు తమకు వచ్చిన జబ్బులు కష్టాలు మంత్రాలూ మాయల వల్ల  వచ్చాయని నమ్మి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు?

Leave a comment