2005 లో మహిళా విజయం మాస పత్రిక ప్రారంభించాను. ఇప్పటి వరకు విరామం ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం మర్చి ఎనిమిదిన విశిష్ట మహిళా పురస్కారం తో సత్కరించింది. ఇప్పుడు నాకు 90 ఏళ్ళు నా వంట్లో ఓపిక ఉన్నంత కాలం మహిళా విజయం మాస పత్రిక తెస్తూనే వుంటాను అంటున్నారు వాసిరెడ్డి కాశీ రత్నం స్వాతంత్రోద్యమం లో పాల్గొని జైలుకు వెళ్లిన కాశీ రత్నం తొమ్మిది దశాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం అవచ్చు.తెలుగు దేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారామె. మహాత్ముడిని కళ్ళారా చుశాకనే జాతీయోద్యమంలో పాల్గొనాలనే స్ఫూర్తి కలిగింది. సహాయనిరాకరణోద్యమం లో పాల్గొని పాటలు పడినందుకే పోలీస్ లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అది నాకు గర్వకారణం ఇవ్వాల్టి మహిళలు అన్ని రంగాల్లో రాణించటం స్వేచ్ఛ,సమానత్వానికి  చాలా దగ్గరగా ఉండటం నాకు సంతోషదాయకం అంటారు వాసి రెడ్డి కాశీరత్నం.

Leave a comment