ప్రపంచ వ్యాప్తంగా అందాన్ని రెట్టింపు చేయటానికి ఎన్నో ప్రకృతి సిద్ధమైన చిట్కా లు ఉపయోగిస్తారు. భారత దేశంలో మృదువైన చర్మం కోసం జుట్టు ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె వాడుతారు చైనాలో గంజికి గ్రీన్ టీ కలిపి ముఖానికి రాసు కొంటారు గంజిని రైస్ మిల్క్ అంటారు. దాన్ని వాడితే ముడతలు మచ్చలూ పోతాయని నమ్ముతారు. ఇటలీలో ఆలివ్ నూనె,గుడ్డు లోని తెల్లసొన సౌందర్య సాధనాలుగా వాడుతారు ఫ్రాన్స్ లో పాలు తేనె కలిపినా నీటితో స్నానం చేస్తే చర్మం కాంతినిస్తోందని భావిస్తారు. స్వీడన్ లో సౌందర్య సాధనాలుగా గ్రీన్ టీ మినరల్ వాటర్ వాడుతారు.

Leave a comment