ఒక సారి పచ్చబొట్టు వేయించుకున్నాక దీన్ని తొలగించు కోవడం ఎంతో నొప్పి తో కూడుకున్న ప్రక్రియ. డెర్మభిరేషన్ , సర్జికల్ , లేజర్ అనే మూడు పద్దతులలో పచ్చబొట్టు తొలగిస్తాను. చర్మం పొర తీసేస్తేనే కానీ పచ్చబొట్టు పోదు. అస్సలు టాటూ వేయించుకోవడంమే ఒక్క సర్జరీ లాంటిది. కొనదరికి పిగ్మెంటేషన్ ఇంజక్షన్స్ పడవు . టాటూ వేసిన చోటు అంతా పుండు లాగా మారి జ్వరం వస్తుంది. టెంపరరీ టాటూల్లో వాడే పారా ఫినాల్ ఎమిడమైన్ అనే రసాయినం వల్ల డెర్మటైటిస్ సమస్యలు వస్తున్నాయి. వీటిలో ఉండే ఇనుము గుణం వల్ల భావిష్యత్తు లో ఎప్పుడైనా ఎమ్మారై స్కానింగ్ తీయవలసి వస్తే ఇబ్బంది అంటున్నారు డాక్టర్స్. టాటూస్ వేసే ఖరీదు తక్కువ అవ్వొచ్చు ఇందుకోసం వాడే సూదులు రంగుల గన్ల నాణ్యత తగ్గింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రక్తం ద్వారా వ్యాపించే ఆనారొగ్యాలు వస్తాయి.

Leave a comment