వయసు 60 దాటితేనే మెదడు బ్రహ్మాండంగా పని చేస్తుందని తెలుసుకోండి అంటున్నారు పరిశోధకులు. కొన్ని అంశాలలో యువత మెదడు కన్నా 60 కి చేరిన వారి మెదడే మెరుగ్గా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు తమ పరిశోధనలో మెదడు పనితీరును జీవన విధానానికి సంబంధం ఉంది అంటున్నారు. నిరంతరం పనిచేసే మెదడుకు విశ్రాంతి కావాలి నిద్ర ద్వారానే ఆ విశ్రాంతి దొరుకుతుంది. అవసరమైన ఎనిమిది గంటల నిద్ర అనుభవించే వారి మెదడు చురుగ్గా ఉంటుంది. నిద్రలేమి,ఒత్తిడి మెదడులోని పొరల వాపు వంటివి మెదడును దెబ్బతీస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి తో మెదడు వయసు ప్రభావానికి గురి కాదు. నడక వంటి శారీరక వ్యాయామం కూడా చాలా ముఖ్యం శరీరం ఎంత కదిలితే మెదడు అంత బాగా పనిచేస్తుంది.

Leave a comment