వంటల్లో వాడే బేకింగ్ సోడా శుభ్రపరిచే పనులకు ఎంతగానో తోడ్పడుతుంది. దుప్పట్లు మురికి వదలాలి అంటే వాషింగ్ మిషన్ లో వేసేప్పుడు ఒక అర కప్పు బేకింగ్ సోడా అర కప్పు వెనిగర్ కలిపితే దుప్పట్లు ఎంతో శుభ్రంగా ఉంటాయి. ముఖం జిడ్డు వదిలి తాజాగా కనిపించాలంటే కూడా ముఖానికి అప్లై చేసే ఫేస్ మాస్క్ లో చిటికెడు సోడా ఉప్పు కలపాలి. గుడ్లు చక్కగా ఉడికి, పై పెంకు తేలికగా రావాలంటే ఉడకబెట్టి నీళ్లలో ఓ స్పూన్ సోడా ఉప్పు కలపాలి. కూరగాయలకు పట్టే హానికారక ఎరువులు పురుగు మందులు పోవాలంటే సోడా ఉప్పు కలిపిన నీటిలో కూరగాయలు కడగాలి. దంతాలు పచ్చగా అయిపోతే సోడా ఉప్పు కలిపి టూత్ పేస్ట్ తో శుభ్రం చేసుకోవాలి చుండ్రు సమస్య కూడా నిమ్మరసం ఉప్పు కలిపి తలకు పట్టించి తలస్నానం చేయాలి.

Leave a comment