వృత్తి పరమైన విజయానికి సరైన వస్త్రధారణ ఎంతో అవసరం అంటుంది నాన్సీ లుబ్లిన్ .ఈమె 1996 లో తన ముత్తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఐదు వేల డాలర్ల తో  మన్‌హట్టన్‌లోని ఒక చర్చి నేలమాళిగలో ‘డ్రెస్‌ ఫర్‌ సక్సెస్‌’ సంస్థ ను స్థాపించింది.ఈ మిషన్‌ అమెరికా అంతటా కొద్ది కాలంలోనే విస్తరించింది. మీరు కనిపించే తీరును బట్టి ప్రజలు మీకు ప్రతిస్పందిస్తారు అన్నదే ఈ సంస్థ స్లోగన్ ఈ ఆలోచనే అన్ని దేశాల మహిళలను కలిపింది. నిరాశ్రయులకు ఆశ్రయం, ఇమిగ్రేషన్ సేవలు, ఉద్యోగం, గృహహింస తో బాధపడే వారికి షెల్టర్ లతో సహా సకల సహాయాలు చేస్తోంది సంస్థ.

Leave a comment