కల్పిత పాత్రల్లో కూడా స్త్రీలు వంటకే పరిమితమా ? ఆడవాళ్ళ పనులు,మగవాళ్ళ పనులు అన్న బేధం ఎప్పటికి పోతుంది. ఇకనైనా స్త్రీలు ఇలా వుండాలి అనే కళ్ళజోడు తీసి మాట్లాడండి అని కామెంట్ చేసింది హీరోయిన్ మాళవికా మోహనన్. పేట్ట తమిళ సినిమా తరువాత ఇప్పుడు మాస్టర్ లో నటిస్తోంది. యాక్టర్ విజయ్ ఫాన్స్ ట్విట్టర్ ఎకౌంట్ లో ఓ ఇలస్ట్రేషన్ చూసింది మాళవిక. అందులో సూపర్ టీమ్ ఆన్ క్వారంటైన్ అనే కాప్లన్ ఉన్న కార్టూన్ లాంటి ఇలస్ట్రేషన్ లో ఆ సినిమా లో పని చేసిన హీరోలు,టెక్నీషియన్ లు అందరు ఎవరి పాటికి వాళ్ళు తోచిన పని చేస్తు వుండగా,అందులో మాళవిక మాత్రం వంట చేస్తూ కనిపిస్తుంది. ఇది నచ్చని మాళవిక కళ్ళజోడు మార్చండి అనటంతో ఆమె పై ట్రోల్స్ మొదలయ్యాయి ఒకళ్ళిద్దరు తప్ప మాళవిక ను  సమర్ధించిన వారే లేరు.

Leave a comment