ఈ లాక్ డౌన్ లో పిల్లలు ఇంట్లోనే కూర్చోవలసి వస్తోంది ఏదైనా చక్కని తిను బండారం చేసి పెట్టాలంటే తెలంగాణ ఫేమస్ ఐటమ్ సర్వపిండి చేయండి అంటున్నారు పోషకాహార నిపుణులు. సర్వపిండి తక్కువ నూనె తో చేయవచ్చు బియ్యం పిండిలో పల్లీలు,శనగ పప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయలు,కరేపాకు,కొత్తిమీర,అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కలిపి రొట్టెల పిండిలా చేసి మందంగా ఉండే గిన్నెలో అడుగుల మందంగా వత్తుకొని వేలితో రంద్రాలు చేసి రెండు మూడు స్పూన్ల నూనె వేసి పొయ్యి మీద సన్నని సెగ పైన ఉడికిస్తే చక్కని ఫలహారం తయారవుతోంది. బియ్యం పిండిలో గోధుమ పిండి,రాగి పిండి కలిపి కూడా సర్వ పిండి చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యం రుచి కూడా సొరకాయ,కేరట్ టమేటా,పాలకూర కూడా ఈ రొట్టెల పిండి లో కలిపి చేసుకోవచ్చు.

Leave a comment