వేడుక సమయాల్లో కాస్త శ్రద్ధగా మేకప్ చేసుకుంటారు కానీ దాన్ని పూర్తిగా తొలగించక పోతేనే చాలా నష్టం చర్మం పాడవుతుంది అంటారు ఎక్సపర్ట్స్. మేకప్ వైప్స్ తో తొలగించి అలవాటుగా మాయిశ్చరైజర్ రాస్తారు కానీ వైప్స్ తో మేకప్ పోదు. ముఖానికి క్లేన్స్‌ర్ రాసి నిమిషంపాటు అలా వదిలేసి ఆ పైన తడి చేసుకుంటూ ముఖమంతా మసాజ్ చేస్తున్నట్లు రుద్ది కడిగేయాలి 100 శాతం శుభ్రం చేయాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. అప్పుడు ముఖ చర్మం పై రంద్రాలు తెరుచుకుని మిగిలిన కొద్దోగొప్పో మేకప్ బయటికి వచ్చేస్తుంది. తర్వాత మిసెల్లర్ వాటర్ ను దూది పైన రెండు చుక్కలు వేసి దాంతో మొహమంతా తుడవాలి అప్పుడు చర్మానికి తేమ అందుతుంది చివరగా మాయిశ్చరైజర్ రాయాలి.

Leave a comment