సూరజ్ బాయ్ మీనా రణతంబోర్ నేషనల్ పార్క్ మొదటి మహిళా నేచరలిస్ట్. రాజస్థాన్ లోని బూరీ పహాడి ఈమె సొంత ఊరు. అమ్మాయిలంటే వంట ఇంటికే అనే ఊరు నుంచి బయటికి వచ్చి పని చేస్తోన్న మొదటి మహిళ. పులులు, సింహాల మధ్య పని చేసే ధైర్యశాలి. జంతువుల గొంతు పాదాల గుర్తులు ఆధారంగా వాటిని కనిపెట్టగల నేర్పుగల అమ్మాయి. రథం బోర్ నేషనల్ పార్క్ లో గైడ్ గా పని చేసే అన్న సూరజ్ బాయ్ స్ఫూర్తి తో ఈ ఉద్యోగంలోకి కోరుకొని మరీ వచ్చాను అని చెబుతోంది. సూరజ్ భాయ్ ఇప్పుడు నన్ను స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామం లోని అమ్మాయిలు విద్య వైపు సాగుతున్నారు. మా ఊరే దాదాపు తన వెనకబడిన అభిప్రాయాలు మార్చుకొన్నది అంటుంది సూరజ్ భాయ్.

Leave a comment