56 ఏళ్ల రాబియా కు పద్మ శ్రీ వరించింది పసితనం చక్రాల కుర్చీకే పరిమితం అయినా పల్లెటూర్లో చదువు రాని గృహిణులకు పాఠాలు చెప్పారు కేరళ లో ప్రభుత్వం అక్షరాస్యత ఉద్యమం చేపట్టడానికి ఆమె స్ఫూర్తి ఆమె మలప్పురం జిల్లాలోని తిరురంగడి అనే ఊరికి దగ్గరలోని ‘వెల్లిలక్కడు’ అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టారు రాబియా పోలియో తో నడవ లేకపోయినా ఆమె డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదువుకొని స్త్రీలకు చదువు నేర్పింది. ‘చలనం’ అనే సంస్థను స్థాపించి దివ్యాంగులకు మానసిక అవస్థలు ఉన్న పిల్లలకు స్కూళ్లు తెరిచింది. చక్కని రచయిత్రి. ఆమె కృషి తో మన ఊరికి చుట్టుపక్కల 8 గ్రామాలు పూర్తి అక్షరాస్యత లోనే ప్రయాణం చేశాయి. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది.

Leave a comment