Categories
పెళ్ళి వేడుకల కోసం చేసే ఏర్పాట్లలో వివాహ వేదిక అలంకరణను కేవలం పూవులతో నే చేస్తే బావుంటుందని పర్యావరణ హితులు సూచిస్తున్నారు. ఒక్కప్పుడు వేదిక అలంకరణ కేవలం మామిడి ఆకులు,కొబ్బరి మట్టలతోనే ఉండేవి. ఆ స్థానంలోకి ప్లాస్టిక్ పూలు ఎన్నో అలంకరణ వస్తువులు వచ్చాయి. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించమని స్థానిక రైతులు సాగు చేసే మల్లె లిల్లీ బంతిపూలు కనకాంబరం వంటివి వాడితే వారికీ ప్రోత్సహకారంగా ఉంటుందంటున్నారు. ఖర్చు కూడా పరిమితంగానే ఉంటుంది. పైన సహజమైన పూల గుబాళింపులు,పచ్చని ఆకుల పందిళ్ళు గంధపు సువాసనలతో పెళ్ళికి అసలైన అందం వస్తుందని చెపుతున్నారు.