వన్ వరల్డ్ అయ్యంగార్ బేకరీ..బెంగుళూరు వాసులకు తప్ప బయట వాళ్లకు అంతగా తెలియని ఈ బేకరీ గురించి గత నెలలో నెటిజెన్స్ విపరీతంగా సెర్చ్ చేసి దాన్ని సెలబ్రిటీ బేకరీ గా మార్చేశారు.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తీసిన ఆకాశం నీ హద్దురా సినిమా లో భార్గవి పాత్ర చూసి నిజ జీవితంలో గోపీనాథ్ భార్యను ఆమె బేకరీ షాప్ సెర్చ్ చేశారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడైన గోపీనాథ్ భార్య భార్గవి కి చెందిన వరల్డ్ అయ్యంగార్ బేకరీ ఒక చిన్న షాపు గా మొదలై తరువాత ఆయన స్థాపించిన ఎయిర్ డెక్కన్ కు క్యాటరింగ్ చేసింది.తొలి ఏడాదిలో 7 కోట్ల రూపాయల బిజినెస్ చేశారట భార్గవి.ఇప్పుడు ఆ బేకరీ స్థాపించి 25 సంవత్సరాలు 25 ఏళ్లుగా విజయవంతంగా ఆ బేకరీ నడుపుతూ మహిళా సాధికారిత కు సరైన నిర్వచనం లా నిలిచారు భార్గవి.

Leave a comment