డాన్సర్, స్టైలిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ తన్వి గీత శంకర్ ఎంతో మందికి ప్రేరణ. ఇంస్టాగ్రామ్ లో ఆమెకు కుప్పలు తెప్పలుగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ప్రత్యేకత ఆమె ప్లస్ సైజ్. శరీర పరిమాణం ఆకృతిని బట్టి అందాన్ని కొలిచే జనరేషన్ ఇది. సన్నగా నాజూగ్గా ఉండే అమ్మాయిలే అందగత్తెలు అంటారు కానీ గీతా తన బొద్దుగా ఉండే ఆకృతిని సెలబ్రేట్ చేసుకుంది. ఊబకాయం అధిక బరువు తో ఉన్నానని ఇబ్బంది పడకండి. సన్నగా ఉన్న వారి లాగే మీరు అన్నీ చేయగలరు. ఫ్యాటీ గా ఉన్నప్పటికీ ఫిట్ గా యాక్టివ్ గా హెల్తీగా ఉండాలి. లావుగా ఉన్న శరీరం గురించి ఆలోచించకుండా అయామ్ ఓకే, అయామ్ వర్త్ ఇట్ అని నమ్మండి మీ వ్యక్తిత్వాన్ని రంగులమయం చేసుకోండి అంటుంది తన్వి గీత శంకర్.

Leave a comment