ఒత్తిడి లేని పిల్లలు స్కూల్ ఎలా ఉండాలో ఏ పద్దతిలో వాళ్ళు అద్భుతంగా పాఠాలు నేర్చుకుంటారో చెబుతూ రైలుబడి అనే పుస్తకం రాసింది రచయిత్రి నటి అయిన టెల్సుకో కురోయనగి ఈమే యాంకర్ గా టెక్స్ కోస్ రూమ్ పేరుతో 1975లో జపాన్ కి చెందిన అసాహి అనే చానల్ ఒక టాక్ షో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కురోయనగి వ్యాఖ్యాతగా పదివేల ఏపిసోడ్స్ పూర్తి చేసింది. ఈ మధ్యనే ఈ టాక్ షో గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.ఈమెకు 85 సంవత్సరాలు దాటిపోయాయి కాని ఈమె షోకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు.సెలబ్రిటీలు కూడా ఈ షోని స్టేటస్ సింబల్ గా భావిస్తారట. ఇక అందచందాలా ఆధారంగానే స్క్రీన్ ప్రజెంటేషన్ బావుంటేనే టాక్ షోలో సక్సెస్ అవుతాయనే చాదస్తం తగ్గించుకోవచ్చు.

Leave a comment