విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజానాభివృద్ది సంస్థ పీ.ఓ లక్ష్మీ వాట్సాప్ లో ఒడిసాలోని రహదారి సౌకర్యం కూడా లేని ప్రాంతంలో ఒక వైద్యుడు ద్విచక్రవాహనం అంబులెన్స్ గా చేసి వైద్య సేవలు చేస్తున్న ఫోటో చూశారు.ఆయన చొరవలో ఆంధ్రాలోని అన్ని ఐటీడీఏ పరిధిలో 122 ఫీడర్ అంబులెన్స్ లు ప్రవేశపెట్టాయి.ఇది మూడు చక్రాల అంబులెన్స్ మోటర్ సైకిల్ కి అమర్చిన చిన్ని తొట్టి లాంటి నిర్మాణం ఇది.కొండ కోనల్లో గిరిజనుల ప్రాణాలు రక్షించే ఆరోగ్యప్రధాయిని.సరైన రహదారులు లేని అటవీ ప్రాంతాలు,కొండ ప్రాంతాల్లో నివశించే ట్రైబల్స్ కోసం ఇలాంటివి వందల కొద్ది ఏర్పాటు చేయవల్సిన అవసరం ఉంది.

Leave a comment