ఎంబర్ సిరామిక్ మగ్ ఒక యాప్ తో పని చేస్తుంది. ఈ మగ్ లో మనం ఎప్పుడూ ఒకే వేడితో కాఫీ టీలు తాగవచ్చు. సాధారణంగా చలికాలం కాస్త వేడిగా ఏదైనా తాగాలనుకొంటారు. వేడిగా ఏ కాఫీ ,టీనో ,కప్పులో పోసుకొని తాగే లోపు వేడి తగ్గిపోతుంది. ఈ ఎంబర్ మగ్ లో అయితే యాప్ ద్వారా మనకు కావలసిన వేడిని సెట్ చేసుకొంటే చాలు . దాన్లో ఎప్పుడు వేడి పానీయం పోసిన దానంతటా అదే వెడెక్కి మనం వేడి చేసిపెట్టుకొన్న ఉష్ణోగ్రతలో ఉండిపోతుంది. ఈ కప్పును మనం చార్జు చేసుకోవచ్చు,తీరుబడిగా ఏ పుస్తకమో చదువుకొంటే వేడివేడి టీ తాగుతూ ఉంటే బావుంటుంది. అనుకొంటే వెంటనే ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వవచ్చు.

Leave a comment